ఉపాధి పనులు లేక రాష్ట్రంలో తీవ్ర వలసలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
ఉపాధి హామీ పనులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉపాధి పనులు ఉంటే వలసలు ఉండేవి కాదని ఆయన స్పష్టం చేశారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద మూడేళ్లకు రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.19 వేలు మాత్రమే ఇచ్చి, రూ.41 వేలు బకాయి పెట్టారని సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.