జన్నారం అటవీ ప్రాంతంలో అరుదైన తెల్ల గుడ్లగూబ గుర్తింపు

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

జన్నారం మండలంలోని అటవీ ప్రాంతంలో తెల్ల గుడ్లగూబను ప్రకృతి ప్రేమికులు గుర్తించారు. జన్నారం అటవీ పరిధిలోని గోండుగూడ బీట్ వైపు వెళ్ళినప్పుడు ఈ అరుదైన పక్షి కనిపించింది. మగ పక్షులు పెరిగే కొద్దీ తెల్లగా మారుతూ చారలు కలిగి ఉంటాయని, చిన్న ఎలుకలు లాంటి జీవులను అవి వేటాడుతాయని ప్రకృతి ప్రేమికులు తెలిపారు. ఈ అరుదైన పక్షిని చూసి వారు ఆశ్చర్యపోయారు.