నిడదవోలులో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం: శ్రమదానం చేసిన మంత్రి దుర్గేష్
రిపోర్టర్: హరి
స్థలం: తూర్పు గోదావరి
నిడదవోలు పట్టణంలోని వీక్లీ మార్కెట్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ప్రజలందరూ భాగస్వామ్యమై పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక అధికారులు, నాయకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకుని చెత్తను తొలగించి శుభ్రపరిచారు.