స్టేజ్ 4 క్యాన్సర్తో పోరాడుతున్న సీనియర్ నటి నఫీసా అలీ
రిపోర్టర్: గోపి
స్థలం: India
దిగ్గజ నటి నఫీసా అలీ తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో ఆందోళనకరమైన అప్డేట్ పంచుకున్నారు. తనకు నాలుగో స్టేజ్ అండాశయ, పెరిటోనియల్ క్యాన్సర్ ముదిరిందని, కాలేయంపై కొత్త క్యాన్సర్ కణాలు గుర్తించినట్లు వెల్లడించారు. 2018 నుంచి క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె, ప్రస్తుతం టార్గెటెడ్ థెరపీ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ధైర్యంగా ఈ పోరాటం సాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.