వర్షాభావంతో కుదేలైన మాడ్గుల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మాడ్గుల

మాడ్గుల మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి మాడ్గుల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సురమళ్ళ సుభాష్ డిమాండ్ చేశారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులు వర్షాభావ పరిస్థితుల కారణంగా నష్టపోకుండా తగిన సహాయం అందించాలని కోరారు.