పోలేరమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ జాతర 2026 ఏర్పాట్లను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మరియు ఆలయ కమిటీ సభ్యులతో సమీక్ష జరిపారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.