మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన రెడ్ క్రాస్ చైర్మన్
రిపోర్టర్: RAMESH LAVETI
స్థలం: నెల్లిమర్ల
విజయనగరం జిల్లా నెల్లిమర్ల పరిధిలోని జరజాపుపేటలో సాధన యువజన సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని వినాయక మట్టి ప్రతిమలను స్థానికులకు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ నివారించి మట్టి ప్రతిమలను పూజించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ వివరాలను సీనియర్ నాయకులు, రెడ్ క్రాస్ లైఫ్ మెంబెర్ లావేటి రమేష్ మీడియాకు తెలియజేశారు.