హిందూపురంలో సరికొత్త ప్రయోగం: పది శాతం సిమెంట్‌తో పర్యావరణ హిత ఇల్లు నిర్మాణం
రిపోర్టర్: విజయ్
స్థలం: శ్రీసత్యసాయి జిల్లా
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఓ యువ ఇంజినీర్ ప్రాచీన పద్ధతిలో కేవలం పది శాతం సిమెంట్ మాత్రమే వాడి సరికొత్తగా ఇంటిని నిర్మించారు. ఇటుకలతో పాటు సున్నం, బెల్లం, కరక్కాయ, ఇసుక, కంకర పొడిని సమపాళ్లలో కలిపి ఈ నిర్మాణం చేపట్టారు. ఈ ఇంటిలో సాధారణ ఇళ్ల కన్నా నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని, ఇది పూర్తిగా పర్యావరణ హితంగా ఉంటుందని ఆయన తెలిపారు.