అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్
రిపోర్టర్: సునీల్
స్థలం: సిడ్నీ
పద్నాలుగు ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ వెల్లడించారు. ఇప్పటికే వన్డేలు, టెస్టుల నుంచి తప్పుకున్న ఆయన, తాజాగా అన్ని ఫార్మాట్లకూ పూర్తిస్థాయిలో రిటైర్మెంట్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్త టీ20 లీగ్లలో మాత్రం ఆటగాడిగా కొనసాగుతానని ఆయన తెలిపారు. ఆసీస్ సాధించిన పలు చారిత్రక విజయాల్ లో కీలక పాత్ర పోషించిన మ్యాక్స్వెల్ నిష్క్రమణతో ఒక అద్భుత శకం ముగిసింది.