కార్మిక హక్కుల రక్షణకు డిసెంబర్లో చలో పార్లమెంట్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో జరిగే చలో పార్లమెంట్ను లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్లతో కార్మికుల హక్కులను బలహీనపరుస్తోందని నేతలు విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కాంట్రాక్టు, గిగ్ కార్మికులకు సమగ్ర సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.