గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం: అడుగుల్పుట్లో అడవి తల్లి బాట ప్రారంభం
రిపోర్టర్: Thrinadh Rudi
స్థలం: పెదబయలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం అడుగుల్పుట్ పంచాయతీ జంగంపుట్టు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నరంజీ ప్రసాద్ రావు, స్థానిక నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.