నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఉపాధి కల్పన ప్రణాళికలు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తపాల్ పూర్ గ్రామంలో నిరుపేదలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ మురుమడుగుల కవిత ఆధ్వర్యంలో గ్రామసభ ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే అభివృద్ధి పనుల ప్రణాళికలు, ఉపాధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మామిడి రాజన్న, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొని గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.