భారతీయ దంపతులపై అమెరికా ఆంక్షలు: ఇరాన్ నౌకాదళానికి సహకరించారంటూ సంచలన నిర్ణయం

రిపోర్టర్: గోపి స్థలం: Washington

ఇరాన్ రహస్య నౌకాదళానికి సహకరించారనే ఆరోపణలపై భారతదేశానికి చెందిన సునీల్ కుమార్ శర్మ, జస్ప్రీత్ ప్రీతి షాహిద్ దంపతులతో పాటు పలు కంపెనీలపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. ఇరాన్ పెట్రోలియం రవాణాకు నకిలీ జెండాలు, సముద్ర ధృవీకరణ పత్రాలు అందించినట్లు ఈ దంపతులపై తీవ్రమైన అభియోగాలు మోపారు.