ఎన్టీఆర్ జిల్లాలో వేగంగా స్పందించిన పోలీసులు: అమెరికన్ పౌరుల బ్యాగ్ స్వాధీనం
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఎన్టీఆర్
అమెరికన్ పౌరులు పోగొట్టుకున్న విలువైన వస్తువుల బ్యాగును కేవలం అరగంట వ్యవధిలో విజయవాడ నగర పోలీసులు గుర్తించి సురక్షితంగా అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నాలుగు పాస్‌పోర్టులు, వీసాలు, బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగును కమాండ్ కంట్రోల్ సిబ్బంది విజయవంతంగా రక్షించినట్లు Vijayawada City Police వెల్లడించారు. ఈ ప్రత్యేక ప్రతిభ కనబరిచిన ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.వి. దుర్గారావును, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు అభినందించారు.