'ప్రజాప్రతినిధులను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదు': బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు సంచలన ఆదేశాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
అసెంబ్లీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనుమతించకపోవడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టసభల్లోకి ప్రజాప్రతినిధులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాల్సింది స్పీకర్ మాత్రమేనని, పోలీసులు కాదని తేల్చిచెప్పింది. అలాగే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది.