జపాన్ లో ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో అపశృతి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: జపాన్
జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల సన్నాహకాల్లో భాగంగా నాగయలో భారత్ సహా ఆరు దేశాల జాతీయ జెండాల ఆవిష్కరణ కార్యక్రమం ఒక గంటకు పైగా ఆలస్యమైంది. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా మరియు నిర్వహణ కమిటీ మధ్య సమన్వయ లోపం వల్లే ఈ జాప్యం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భారత చెఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్ తో పాటు డిప్యూటీ చెఫ్ డి మిషన్లు శరత్ కమల్, అంజలి భగవత్ హాజరయ్యారు.