తిరుమలకు చేరుకున్న రిలయన్స్ ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనಂತ್ అంబానీ విరాళంగా ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో 15 బస్సులు తిరుమలకు చేరుకున్నాయి. రూ.27.5 కోట్ల విలువైన ఈ బస్సులను ఈనెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభ వేళ ఈ బస్సులు సామాన్య భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.