వియత్నాం విద్యా విధాన పరిశీలనకు జన్నారం ఉపాధ్యాయురాలు ఎంపిక
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం అక్కపెళ్లిగూడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు అంకం కరుణ వియత్నాం పర్యటనకు ఎంపికయ్యారు. ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న ఆమె, వియత్నాంలో అమలు చేస్తున్న విద్యా విధానాన్ని పరిశీలించనున్నారు. అక్టోబర్ 10 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా ఆమె అక్కడి విద్యా ప్రమాదాలు, బోధనా పద్ధతులపై ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.