ఆమనగల్లు పీఏసీఎస్ ఛైర్మన్ పగ్గాలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డి

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ నియామకానికి సహకరించిన కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానని, అందరి సహకారంతో సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని గూడూరు శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.