కేసీఆర్‌పై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు

రిపోర్టర్: హరి స్థలం: సిద్దిపేట

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలకు దిగడం చేతగానితనమని మండిపడుతూ, ఎమ్మెల్యేపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.