దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో దుగరాజపట్నంలో రూ. 15,000 కోట్ల భారీ పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు కోసం మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే ఐదేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45,000 మంది యువతకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.