షాకింగ్ ఘటన: ఆసుపత్రిలో ఉన్నానంటూ నూతన ఉద్యోగానికి ఎగ్గొట్టిన యువతి గుట్టురట్టు
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
ఉద్యోగంలో చేరే సమయంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరానంటూ నూతన అభ్యర్థి మోసానికి పాల్పడినట్లు వన్షివ్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు గౌరవ్ ఖేతర్పాల్ తెలిపారు. జాయినింగ్ తేదీ నాటికి రాకుండా సోదరి ద్వారా అబద్ధాలు చెప్పించి, అదే వారంలో బెంగళూరులోని మరో సంస్థలో ఆ అభ్యర్థి చేరినట్లు సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చే ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.