గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై సెక్యూరిటీ గార్డు లైంగిక వేధింపులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇందిరానగర్‌లో క్యాబ్ ఎక్కుతున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పక్కకు లాగి ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. సీసీటీవీ టేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఝార్ఖండ్‌కు చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.