అక్టోబరు 2న రాయలసీమ ఉద్యాన హబ్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రాజేష్ స్థలం: మదనపల్లె

అక్టోబరు 2న అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ ఉద్యాన హబ్ను ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పది జిల్లాల్లో 201 క్లస్టర్లతో ఈ హబ్ను అభివృద్ధి చేసి, గ్లోబల్ ఫ్రూట్ బౌల్గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, ప్రతి రైతుకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా పటిష్టమైన ప్రణాళికలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యాన రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ఆయన పేర్కొన్నారు.