నా కెరీర్లోనే అత్యంత విభిన్నమైన చిత్రం సీన్ అంటూ హీరో సూర్య వ్యాఖ్య

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమకు విలువ కట్టలేనని, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ చిత్రంలో తన పాత్ర చెబుతుందని హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య స్పష్టం చేశారు. జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ డ్రామా చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుందని ఆయన తెలిపారు.