డబ్బుల కోసమే బిగ్ బాస్ షోకి వెళ్లాను అంటున్న నోరా ఫతేహి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ముంబై
బాలీవుడ్ నటి నోరా ఫతేహి తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. వరుస పాటల్లో నటించినా రెమ్యునరేషన్ అందలేదని, డబ్బుల కోసమే బిగ్ బాస్ సీజన్-9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చానని ఆమె తెలిపారు. అదే ఛానెల్‌లో ప్రసారమయ్యే ఝలక్ దిఖ్లా జా షోలో అవకాశం కోసమే తాను బిగ్ బాస్‌కు వెళ్లేందుకు ఒక కండీషన్ పెట్టినట్లు నోరా క్లారిటీ ఇచ్చారు.