బొబ్బిలి పట్టణంలో కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘం పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు శంకుస్థాపన చేశారు. గొల్లపల్లిలో సీసీ రోడ్లు, శివాలయం నుంచి దాడితల్లి అమ్మవారి గుడి వరకు బి.టి రోడ్డు, రైల్వే స్టేషన్ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నూతన రైతు బజార్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.