విజయ్ విహార్ ప్రాంతంలో హెడ్ కానిస్టేబుల్ పై దుండగుల దాడి

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

న్యూఢిల్లీలోని విజయ్ విహార్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్పై ఏడుగురు దుండగులు బేస్బాల్ బ్యాట్లతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అల్లర్లు సృష్టిస్తున్న వారిని హెచ్చరించి వెనక్కి వస్తున్న పోలీసు సిబ్బందిపై ఈ దురాఘతం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కంటి కింద తీవ్రగాయాలైన హెడ్ కానిస్టేబుల్కు వైద్యులు కుట్లు వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.