ఆరోగ్య సంజీవనిగా నిలిచిన వాసవి క్లబ్ వైద్య శిబిరం
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం నగరంలోని శివాలయం వీధి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు మారేమల్ల రామకృష్ణ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరవగా, వైద్య సిబ్బంది వారికి పలు ఆరోగ్య పరీక్షలు చేసి తగిన సలహాలు, సూచనలు అందించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే తమ ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుగ్గల శ్రీహరి, కోశాధికారి కురువెళ్ల గోపాలకృష్ణమూర్తి, శ్రీనివాస్, కృష్ణవేణి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.