దక్షిణ ఢిల్లీలో జిమ్ యజమాని దారుణ హత్య
రిపోర్టర్: రాజేష్
స్థలం: New Delhi
దక్షిణ ఢిల్లీలోని అయా నగర్లో జిమ్ యజమాని విజయ్ లోహియాను దుండగులు కాల్చి చంపారు. జిమ్ వెలుపల జరిగిన ఈ ఘటనలో ఆయనపై పదికి పైగా రౌండ్లు కాల్పులు జరిపారు. ఆస్తి వివాదాలు, పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.