కోటలో విషాదం: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
రిపోర్టర్: రాము
స్థలం: Kota
కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన కోటలో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని సర్కిల్ ఇన్స్పెక్టర్ ముఖేష్ మీనా తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పదహారేళ్ల జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోగా, బీహార్‌కు చెందిన మరో నీట్ అభ్యర్థి బాత్రూమ్లో స్పృహ కోల్పోయి చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు వెల్లడించారు. ఈ వరుస మరణాలు విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తుండటంతో, కుటుంబ సభ్యులు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.