'నేడు ఉక్కపోత.. రేపటి నుంచి వర్షాలు': వాతావరణ నిపుణుల హెచ్చరిక
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. తెలంగాణలో నేడు పొడి వాతావరణంతో పాటు తీవ్ర ఉక్కపోత ఉండే అవకాశం ఉందని, సౌత్, ఈస్ట్ తెలంగాణ ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు. అయితే రేపు రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. మరోవైపు ఏపీలోని కోస్తా జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.