ఆమదాలవలస మండలం చిన్న కృష్ణాపురం పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ ఏకగ్రీవ ఎంపిక
రిపోర్టర్: Pydi. Suryanarayana
స్థలం: ఆమదాలవలస
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చిన్న కృష్ణాపురం ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల ఎంపికను మంగళవారం ఉదయం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పాఠశాల చైర్మన్ గా మజ్జి పార్వతి, వైస్ చైర్మన్ గా కూన అప్పలనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు హెచ్ఎం ఎస్ ధనుంజయరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జ్ కూన రాముతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.