కేటీఆర్ పీఏ విచారణలో ఉద్రిక్తత, పోలీసులతో లాయర్ల వాగ్వాదం

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో కేటీఆర్ పీఏ మహేందర్, పీఆర్ఓ మహేష్‌ల విచారణ సందర్భంగా సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ వద్ద జరిగిన వివాదానికి సంబంధించి పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, హైకోర్టు మార్గదర్శకాలు ఉల్లంఘిస్తున్నారంటూ న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్లకు సమాచారం ఇవ్వకుండా విచారణ జరపడంపై పోలీసులతో వాగ్వాదానికి దిగారు.