ఇళ్ల స్థలాల సాధన కోసం ఖమ్మం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

గొల్లగూడెంలోని వక్ఫ్ భూముల్లో పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తంజీమ్ ఏ ఇన్సాఫ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. 2010 నుంచి పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ భూముల పరిరక్షణతో పాటు పేదలకు స్థలాలు కేటాయించాలని మహమ్మద్ సలాం డిమాండ్ చేశారు. వందలాది మంది మహిళలు పాల్గొని అధికారులకు వినతిపత్రం అందజేశారు.