రాజస్థాన్ ప్రభుత్వ తీరుపై అశుతోష్ రాంకా తీవ్ర విమర్శలు
రిపోర్టర్: విజయ్
స్థలం: New Delhi
రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సభ్యుడు అశుతోష్ రాంకా ఉదయ్‌పూర్, జైపూర్ పరిణామాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం తాము చేస్తున్న తనిఖీలను అడ్డుకోవాలని చూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా తమను భయపెట్టాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని, రాష్ట్రంలోని అన్ని పాఠశాలల పరిస్థితి మెరుగయ్యే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.