నాగినేనిప్రోలులో బెల్టుషాపుల రద్దు: గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం

రిపోర్టర్: సునీల్ స్థలం: బూర్గంపహాడ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీలో మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధిస్తూ సర్పంచ్ బానోత్ సరోజ మరియు పాలకవర్గం సంచలన తీర్మానం చేసినట్లు అధికారులు తెలిపారు. పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ఎస్ఐ మేడా ప్రసాద్ మాట్లాడుతూ బెల్టుషాపుల నియంత్రణకు పంచాయతీ తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయమని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.