షాకింగ్ ఘటన: గత నలభై ఎనిమిదేళ్లుగా మంచినీళ్లు తాగనని బిలియనీర్ వారెన్ బఫెట్ వెల్లడి

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

ప్రపంచ కుబేరుల్ లో ఒకరైన వారెన్ బఫెట్ గత నలభై ఎనిమిదేళ్లుగా మంచినీళ్లు తాగలేదని తోటి బిలియనీర్ బిల్ అకమన్ వెల్లడించారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడిన ఆయన, బఫెట్ తన ఇంటికి డిన్నర్ కు వచ్చినప్పుడు ఈ ఆసక్తికర విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నారు. నీళ్లకు బదులుగా ఆయన చెర్రీ కోక్ మాత్రమే తాగుతారని, ఈ విచిత్రమైన అలవాటు దశాబ్దాలుగా కొనసాగుతోందని అకమన్ స్పష్టం చేశారు.