తుఫాన్ వేళ ప్రజలకు అండగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు సిద్ధం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
తుఫాన్ ముప్పు నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆలస్యం చేయకుండా సంబంధిత మండల కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ సహాయం అందించేందుకు ఈ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.