బ్యాంకులకు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి

రిపోర్టర్: హరి స్థలం: ఎన్టీఆర్ జిల్లా

విజయవాడ ధర్నా చౌక్‌లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మె నిర్వహించారు. వారానికి ఐదు రోజుల పని దినాలు ప్రవేశపెట్టాలనే ప్రధాన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని నాయకులు మండిపడ్డారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.