రష్యా చమురు దిగుమతులపై అమెరికాలో కీలక బిల్లుపై ఓటింగ్.
రిపోర్టర్: గోపి
స్థలం: అమెరికా
రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై వంద శాతం వరకు టారిఫ్‌లు విధించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుపై అమెరికా ప్రతినిధుల సభ ఓటింగ్ నిర్వహించనుంది. ఈ బిల్లులో భారత్ సహా పది దేశాల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సవరణ తెచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వాషింగ్టన్ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఈ చట్టం అమల్లోకి వస్తే భారత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.