స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అరాచకాలు: ఎస్ఈసీని ఆశ్రయించిన టీడీపీ నేతలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాయలసీమలో వైఎస్సార్సీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు వర్ల రామయ్య, అశోక్బాబు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పుంగనూరు, రాయచోటి, తిరుపతి, ధర్మవరంలో వైఎస్సార్సీపీ నాయకుల రౌడీయిజంపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నామినేషన్ల సమయంలో దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, హింసాత్మక రాజకీయాలను అణచివేయాలని అధికారులను కోరారు.