ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలో తలసాని సాయికిరణ్ వైపు కేసీఆర్ మొగ్గు

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

తెలంగాణలో ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. హైకోర్టు అనర్హత వేటు వేయడంతో దానం నాగేందర్ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖైరతాబాద్ అభ్యర్థిగా తలసాని సాయికిరణ్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్, ఎన్నికల వ్యూహ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.