కోదాడలో వినూత్న రీతిలో మెగా జాబ్ మేళా ప్రచారం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పోలీసులు ఉద్యోగార్థుల కోసం చేపట్టిన మెగా జాబ్ మేళా ప్రచారం విశేష స్పందన పొందుతోంది. శుక్రవారం కోదాడ మండలంలోని బిక్య తండ మార్గంలో ప్రచార వాహనాన్ని చూసి ఆగిన ఓ నిరుద్యోగ యువకుడు, క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఉద్యోగ వివరాలను తెలుసుకున్నాడు. గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగ సమాచారం చేరవేయడానికి పోలీసులు చేపట్టిన ఈ వినూత్న ప్రచార విధానం నిరుద్యోగుల్లో అంతులేని ఆసక్తిని కలిగిస్తోంది.