యూరప్‌తో మైత్రికి కెనడా అడుగులు

రిపోర్టర్: సతీష్ స్థలం: World

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నడుమ కెనడా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. యూరోపియన్ యూనియన్‌తో అనుబంధ సభ్యత్వం కోసం కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఐరోపా నేతలతో చర్చిస్తున్నారు. అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా ఇంధనం, రక్షణ, సాంకేతిక రంగాలలో బంధం మరింత బలపడే అవకాశం ఉంది.