కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అభిమానులకు మేకర్స్ నుంచి భారీ షాక్

రిపోర్టర్: రాజేష్ స్థలం: చెన్నై

ధనుష్ నటిస్తున్న డీ56 సినిమా మొదటి లుక్ పోస్టర్ దీపావళికి రాదని దర్శకుడు తమిళరసన్ పచముత్తు స్పష్టం చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఓం సినిమా విడుదలైన తర్వాతే డీ56 అప్డేట్లు వస్తాయని ఆయన ఎక్స్ వేదికగా ఓ అభిమాని ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. దీంతో ఈ చిత్రానికి సంబంధించి పండుగ సమయంలో ఎలాంటి ప్రకటన ఉండదని తేలిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.