దేశంలో వైద్య ఆరోగ్య రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో దేశంలో వైద్య ఆరోగ్య రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య సేవలను విస్తరించడంతోపాటు మాతా శిశు సంరక్షణలో కీలక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ఆయన పేర్కొన్నారు. భారత్ సాధించిన ఈ వైద్య రంగ పురోగతికి అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభిస్తోందని, దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కిషన్ రెడ్డి వివరించారు.