వరరంగల్ భూకబ్జాలు: భద్రకాళి చెరువు శిఖం భూముల ఆక్రమణపై లోకాయుక్త విచారణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
వరంగల్ భద్రకాళి చెరువు శిఖం భూములతో పాటు ఆలయ భూములు ఆక్రమణకు గురైనట్లు వచ్చిన ఫిర్యాదులపై లోకాయుక్త తీవ్రంగా స్పందించింది. దాదాపు ఆరు వందల యాభై ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్లు అందిన ఫిర్యాదుతో రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. సర్వే నంబర్ల వారీగా హద్దులు గుర్తించి, రికార్డులను పరిశీలించి త్వరలోనే ఉన్నతాధికారులకు పూర్తి స్థాయి నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.