భారత్‌లో స్టార్‌లింక్ లైసెన్స్‌పై అంబానీ పాత్ర ఉందంటూ రాహుల్ గాంధీ ప్రశ్నలు
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
భారతదేశంలో స్టార్‌లింక్ ఉపగ్రహ సేవలకు లైసెన్స్ జాప్యం వెనుక రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ హస్తం ఉందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన పోస్ట్‌ను ఆయన ఉటంకిస్తూ ఈ మేరకు స్పందించారు. ఐదేళ్లుగా నిబంధనలు పాటిస్తున్నప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఎందుకు రాలేదని నిలదీశారు. ఈ పరిణామం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.