జన్నారంలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు.. ఉద్రిక్తత
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేలను అవమానించారంటూ, పార్టీ పిలుపు మేరకు ఆందోళనకు సిద్ధమైన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని వారు పోలీసులను ప్రశ్నించారు. ఈ ఘటనతో మండల కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.